![]() |
![]() |
.webp)
బుల్లితెరపై వర్ష తన అందంతో తిరుగులేని ఫాలోయింగ్, క్రేజ్‌ను దక్కించుకుంది. యాక్టింగ్,డ్యాన్స్ ఇలా అన్నింట్లో నెటిజన్లు ఆమెకు తక్కువ మార్కులు వేస్తుంటారు. కానీ అందంలో మాత్రం ఎక్స్‌ట్రా మార్కులు వేస్తుంటారు. అలా వర్ష తన అందాల ప్రదర్శనతో నెట్టింట్లో దుమ్ములేపేస్తుంటుంది.
బుల్లితెరపై సీరియల్స్‌తో ప్రయాణం మొదలుపెట్టి.. జబర్దస్త్ షోతో వెలుగులోకి వచ్చింది వర్ష. ఇప్పుడు జబర్దస్త్ బ్యూటీగా తిరుగుని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. గత ఆరేడేళ్లుగా జబర్దస్త్ షోలో కంటిన్యూ అవుతూనే వస్తోంది. ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీలోనూ సందడి చేస్తోంది. పండుగ ఈవెంట్లు, బుల్లితెరపై షోలు అంటూ బాగానే బిజీగా ఉంటోంది. ఇక నెట్టింట్లో వర్ష తన అందాలను ప్రదర్శించే తీరుకు అంతా ఫిదా అవుతుంటారు. వర్షకి ఇన్ స్టాగ్రామ్ లో 2.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తను ఇప్పుడు ఏ పోస్ట్ చేసినా, ఏ రీల్ చేసిన తక్కువలో తక్కువ ముప్పై వేల లైక్లు.. వన్ మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. అటు యూట్యూబ్ లో వ్లాగ్స్.. ఇటు ఇన్ స్ట్రాగ్రామ్ లో ఫోటోషూట్స్, రీల్స్ తో ఎప్పుడు నెటిజన్లకి దగ్గరగా ఉంటుంది ఈ భామ.
తాజాగా వర్ష తన ఇన్ స్టాగ్రామ్ లో రెడ్ కలర్ చీరలో కొన్ని ఫోటోలని షేర్ చేసింది. వాటిల్లో కొన్ని ఫోటోలు మరీ బోల్డ్ గా ఉన్నాయి. ఇక ఈ ఫోటోలని చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. రెస్పెక్ట్ ట్రాన్స్ జెండర్ అంటు, మీరు సూపర్ సర్ అంటూ కొందరు నెగెటివ్ కామెంట్లు చేస్తుంటే.. లుకింగ్ లైక్ ఏంజిల్, బ్యూటిఫుల్ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. దాంతో ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
![]() |
![]() |